![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వారమైంది. అందులో మొత్తం పదిహేను కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఆదివారం నాటి ఎపిసోడ్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఆరుగురు కామనర్స్, ఎనిమిది మంది సెలెబ్రిటీస్ ఉన్నారు.
సెలెబ్రిటీ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ రాము రాథోడ్. 'రాను.. బొంబాయ్ కి రాను' అనే పాటతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన ఈ మహాబూబ్ నగర్ కుర్రాడికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. రీసెంట్ గా జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో కూడా పోటీకి వచ్చిన వారంతా.. రాను బొంబాయ్ కి రాను పాటకి డ్యాన్స్ చేయడంతో రాము రాథోడ్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దాంతో అతడికి బిగ్ బాస్ లో అవకాశం దొరికింది. హౌస్ లో మొదటివారం నామినేషన్ లో ఉన్న రాము రాథోడ్ కి మంచి ఓటింగ్ పడింది. మరి సెకెండ్ వీక్ లో ఉంటాడో లేడో తెలియాలంటే మరోరోజు ఎదురుచూడాల్సిందే.
రాము రాథోడ్ ని మొన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో చూసిన అతని తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట. రాము హౌస్ లో నవ్వుతూ ఉండటం చూసి వాళ్ళు సంతోషంగా ఉన్నారంట.. అయితే హౌస్ లో గొడవలు జరగడం అంతగా బాగోలేదని వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడారు. బిగ్ బాస్ సీజన్-9 (Bigg Boss 9 Telugu)లో రాము రాథోడ్ బిహేవియర్ ఎలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.
![]() |
![]() |